Hyderabad, మార్చి 4 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇప్పటికీ ఎన్నో చూశాం. ఇప్పుడు మరో కొత్త సమస్య రాదని గ్యారెంటీ ఏంటీ అని రుద్రాణి అంటే.. మరోవైపు కారులో ఓ అమ్మాయిని చూపిస్తారు. ఇంట్లో నాకు ఇంత ఆనందం చూస్తుంటే భయమేస్తుంది అమ్మా. ఆరోజు కూడా అంతా పార్టీ చేసుకున్నాం. తెల్లారితే కారులో శవం దొరికింది అని రుద్రాణి అంటుంది. ఆ నోటితో మంచి మాటలు రావా అని ప్రకాశం అంటాడు.

నువ్ నోరు తెరవద్దు అని అపర్ణ అంటుంది. ఇది బాగుంది. ఆస్తులు పోడానికి నాన్న కారణమయ్యాడు, అప్పు కాడానికి రాజ్, కావ్య కారణం, రాజ్ కేసులో ఇరుక్కోడానికి అనామిక కారణం. మధ్యలో నేను ఏం చేశాను. జాగ్రత్త పడమన్నందుకు నేను చెడ్డదాన్ని అయ్యానా. చూస్తూ ఉండండి ఈ సంతోషం ఎక్కువ కాలం ఉండదు అని రుద్రాణి హెచ్చరిస్తుంది. ఎలాంటి సమస్యలు వచ్చిన ఎదుర్కొడానికి నా ...