భారతదేశం, మార్చి 3 -- రాజ్‌ను మ‌ర్డ‌ర్ కేసులో ఇరికించి అత‌డిని జైలుకు పంపించాల‌ని క‌న్నింగ్ ప్లాన్ వేస్తుంది అనామిక‌. కానీ కావ్య తీసుకొచ్చిన కోట‌ర్ క‌మ‌లేష్ అనే సాక్షి కార‌ణంగా ఆమె ఆడిన డ్రామా మొత్తం బ‌య‌ట‌ప‌డుతుంది. సామంత్‌ను తానే చంపి అత‌డి డెడ్‌బాడీని రాజ్ కారు డిక్కీలో పెట్టిన‌ట్లు కోర్టులో నిజం ఒప్పుకుంటుంది అనామిక‌. ఏం జ‌రిగిందో చెబుతుంది. మొద‌టి భ‌ర్త‌ను వేధించి విడాకులు తీసుకున్న అనామిక‌...సామంత్‌ను అతి దారుణంగా చంపింద‌ని, ఇలాంటి క్రిమిన‌ల్‌కు క‌ఠిన శిక్ష ప‌డాల‌ని రాజ్ త‌ర‌ఫు లాయ‌ర్ వాదిస్తాడు.

అనామిక‌నే హ‌త్య చేసింద‌ని నిర్ధారిస్తాడు జ‌డ్జ్‌. హ‌త్య చేయ‌డ‌మే కాకుండా ఒక నిర‌ప‌రాధి మీద‌కు ఈ కేసు మ‌ళ్లించాల‌ని చూసినందుకు అనామిక‌కు 14 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్న‌ట్లు జ‌డ్జ్ ప్ర‌క‌టిస్తాడు. రాజ్‌ను నిర్ధోషిగా విడుద‌ల చేస్తున్న‌ట్లు ప...