Hyderabad, మార్చి 29 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో బెడ్‌పై ఉన్న యామిని తండ్రి పెళ్లి గురించి రాజ్‌ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. మీ తల్లిదండ్రులు మేము మీ ఇద్దరి పెళ్లి గురించి ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ, వాళ్లు నీ చిన్నప్పుడే పోయేసరికి మీ పెళ్లి చూసే అదృష్టం కోల్పోయారు. నాకు కూడా అలానే జరుగుతుందేమో అని భయంగా ఉందని యామిని తండ్రి అంటాడు.

నువ్ ఉన్న పరిస్థితుల్లో ఇలా అడగడం కరెక్ట్ కాదు. కానీ, నేను పోయేలోపు మీ ఇద్దరిని భార్యాభర్తలుగా చూడాలి. అదే నా చివరి కోరిక అనుకుని యామినిని పెళ్లి చేసుకో బాబు అని యామిని తండ్రి అంటాడు. ఎందుకు అంత బతిమిలాడుతారు. చిన్నప్పటి నుంచి వారు ఒకరికోసం ఒకరు పుట్టారని ఎంతలా అనుకోలేదు మనం అని వైధేహి అంటుంది. కానీ, మూడు ముళ్లు వేస్తే నా కోరిక తీరుతుంది అని యామిని తండ్రి ...