Hyderabad, మార్చి 28 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య భోజనం క్యారేజ్ కట్టి రాజ్‌కు పంపించిందని రుద్రాణి చెబుతుంది. కానీ, ఆయన పేరు మీద అనాథ ఆశ్రమానికి పంపించినట్లు కావ్య అబద్ధం చెబుతుంది. దాంతో కావ్యను ఇరికిద్దామనుకున్న రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అంతా రుద్రాణిని తిడతారు.

స్వప్న కౌంటర్ల మీద కౌంటర్ల వేస్తుంది. తినకుండా రుద్రాణి లేస్తుంటే.. చేసిన ఘనకార్యం చాలు గానీ తిను అని సుభాష్ ఆపుతాడు. దాంతో ఆగిపోతుంది. హమ్మయ్య ఆయన విషయం అయితే బయట పడలేదు అని ఊపిరి పీల్చుకుంటుంది కావ్య. కృష్ణయ్య మావారిని దాచిపెట్టడానికి చిన్న అబద్ధం చెప్పాను. క్షమించు. ఇంతకీ నేను చేసిన వంట ఆయన తిన్నారోలేదో అని కావ్య అనుకుంటుంది. మరోవైపు కావ్య వంట చాలా బాగుందని రాజ్ పొగుడ్తూ ఉంటాడు.

కావ్య పద్ధతిగా ఉండటమే కాదు వంట కూడా ...