భారతదేశం, మార్చి 28 -- Brahmamudi March 28th Episode: రాజ్ కొడుకు గుక్క‌పెట్టి ఏడుస్తాడు. ఆ చిన్నారిని ఎలా స‌ముదాయించాలో తెలియ‌క రాజ్ ఇబ్బంది ప‌డ‌తాడు. చివ‌ర‌కు క‌ళ్యాణ్ స‌హాయంతో ఉగ్గు ప్యాకెట్ తీసుకొచ్చి ఆ చిన్నారికి తినిపిస్తుంది కావ్య‌. ఉగ్గు తిన్న చిన్నారి నిద్ర‌పోతాడు. కావ్య‌కు థాంక్స్ చెబుతాడు రాజ్‌. మీరు థాంక్స్ చెబితే సంతోష‌ప‌డే రోజులు పోయాయ‌ని కావ్య అంటుంది. నేను అడిగితే మీరు చెప్ప‌లేరు. మీరు చెప్పేది నాకు అక్క‌ర‌లేద‌ని కావ్య అంటుంది.

రాజ్ త‌న కొడుకు కోసం ఊయ‌ల ఆర్డ‌ర్ పెడ‌తాడు. డెలివ‌రీ బాయ్ ఇంటికొస్తాడు. ఈ ఊయ‌ల నువ్వే ఆర్డ‌ర్ పెట్టావా అంటూ అప‌ర్ణ‌ను ఏడిపించాల‌ని చూస్తుంది రుద్రాణి. అవును నిన్నే ప‌డుకోబెట్టి ఊపుదామ‌ని ఆర్డ‌ర్ పెట్టాన‌ని కోపంగా బ‌దులిస్తుంది అప‌ర్ణ‌. ఈ ఊయ‌ల నీ మ‌న‌వ‌డి కోసం నువ్వే ఆర్డ‌ర్ పెట్టావు...కానీ మాకు చెప...