Hyderabad, మార్చి 27 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య కళావతిగా యామిని ఇంట్లో అందరికి పరిచయం అయి వెళ్లిపోతుంది. కళావతిని వైధేహి మెచ్చుకుంటుంది. ఏంటీ మమ్మీ ఏం చేస్తున్నారో మీకేమోనా అర్థమవుతుందో. ఎవరు వచ్చారో ఏం తెలుసుకోకుండా ఏదో పెళ్లి చూపులకు కూర్చుండబెట్టినట్లు రామ్‌తో మాట్లాడిస్తారా. దాన్ని అసలు ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సింది అని యామిని అంటుంది.

ఏదో థ్యాంక్స్ అని చెప్పడానికి వెతుక్కుంటూ వచ్చింది. మంచి అమ్మాయి అనిపించింది అని వైధేహి అంటుంది. ఇంకేం వాళ్లిద్దరికి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయు అని యామిని అంటుంది. ఎందుకు అలా అంటున్నావ్. తనను చూస్తే మంచి అమ్మాయిలా ఉందని యామిని తండ్రి అంటాడు. మంచి అమ్మాయి కాదు ముంచే అమ్మాయి. తను రామ్ భార్య. తనే కావ్య అంటే.. అని యామిని అంటుంది. దాంతో ఇద్ద...