భారతదేశం, మార్చి 26 -- అప్పు ద్వారా యామిని ఇంటి అడ్రెస్ క‌నిపెడుతుంది కావ్య‌. రాజ్‌ను క‌ల‌వ‌డానికి బ‌య‌లుదేరుతుంది. కావ్య ఇంటి బయ‌ట‌కు వెళ్ల‌కుండా అడ్డుకోవాల‌ని చూస్తుంది రుద్రాణి. ఆమె నోరు మూయిస్తుంది కావ్య‌. నా జోలికి మీరు వ‌స్తే మీ జోలికి నేను వ‌స్తాన‌ని అంటుంది. మీ హ‌ద్దుల్లో మీరు ఉండ‌టం మంచిద‌ని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది.

రుద్రాణితో గొడ‌వ ఎందుక‌ని, నీకు ఏం కావాల‌న్న మేము తీసుకొస్తామ‌ని కావ్య‌కు స‌ర్ధిచెప్ప‌బోతాడు సుభాష్‌. అంటే నేను గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు వెళితే ఇంటి ప‌రువు పోతుంద‌ని మీరు కూడా న‌మ్ముతున్నారా అని సుభాష్‌ను అడుగుతుంది కావ్య‌. నీకు హెల్ప్ చేద్దామ‌ని అన్నాన‌ని సుభాష్ బ‌దులిస్తాడు. మీ న‌మ్మ‌కం వేరు...నేను వెళుతున్న దారి వేరు.

అలాంట‌ప్పుడు నేను అడిగింది ఎలా తీసుకువ‌స్తార‌ని సుభాష్‌తో ఎమోష‌న‌ల్‌గా చెబుతుంది కావ్య‌. నా జీవ...