భారతదేశం, మార్చి 25 -- 30 రోజుల్లో రాజ్‌ను తీసుకొస్తాన‌ని రుద్రాణితో కావ్య ఛాలెంజ్ చేస్తుంది. కావ్య కాన్పిడెన్స్ చూసి రుద్రాణి కూడా భ‌య‌ప‌డిపోతుంది. కావ్య చెబుతుంది నిజ‌మేనా? రాజ్ బ‌తికే ఉన్నాడా? అని టెన్ష‌న్ ప‌డుతుంది. రాజ్ బ‌తికే ఉంటే దుగ్గిరాల ఇంటి వార‌సుడు కావాల‌నే త‌న క‌ల తీర‌ద‌ని రాహుల్ బాధ‌ప‌డ‌తాడు.

ఒక ర‌కంగా 30 రోజులు డెడ్ లైన్ పెట్టి కావ్య మంచిప‌నే చేసింద‌ని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. రాజ్ నిజంగా బ‌తికే ఉంటే...ఎక్క‌డున్నాడో తెలుసుకొని ఈ ఇంటికి రాకుండా శాశ్వ‌తంగా అత‌డి అడ్డు తొల‌గిద్దామ‌ని అంటుంది. అత‌డి ప్రాణాలు మ‌నం తీసేద్దామ‌ని కొడుకు రాహుల్‌తో త‌న ప్లాన్ వివ‌రిస్తుంది రుద్రాణి.

రాజ్ ఎక్క‌డున్నాడో ఎలా తెలుసుకోవ‌డం అని రాహుల్ డౌట్‌గా అడుగుతాడు. కావ్య ద్వారానే తెలుసుకుందామ‌ని రుద్రాణి బ‌దులిస్తుంది. రాజ్ బ‌తికే ఉంటే కావ్య అత‌డ...