Hyderabad, మార్చి 24 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ప్రిన్సిపాల్ ఫొటో ఇస్తే వాళ్లెవరు గుర్తు రావట్లేదని రాజ్ అంటాడు. దాంతో అందులో ఎవరెవరేంటో యామిని చెబుతుంది. అది చూసిన కావ్య ఆయనకు గతం గుర్తులేదని నీకు నచ్చిన గతాన్ని చూపిస్తూ బొమ్మల ఆడుకుంటున్నావ్ యామిని. నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటుంది.

సారీ యామిని నిజంగా నాకెవరు గుర్తుకు రావట్లేదు అని రాజ్ అనడంతో.. వీళ్లు నీకు గుర్తుకురావాలని చూపించట్లేదు. నీకు గతం గుర్తుకు రావట్లేదని ఫీల్ అవుతున్నావ్ కదా. నీకు ఓల్డ్ మెమోరీస్ చూపించాలని తీసుకొచ్చాను. ఎక్కువగా ఆలోచించకు అని యామిని అంటుంది. ఇంతలో ప్రిన్సిపాల్ సక్సెస్ అన్నట్లుగా చేయి వేలు చూపిస్తుంది. యామిని కూడా అలాగే అంటుంది. తర్వాత రాజ్, యామిని వెళ్తారు. అది చూసి కావ్య కూడా వెళ్తుంది.

ఏంటీ ప్రిన్సిపాల్ న...