Hyderabad, మార్చి 22 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ గతం మర్చిపోయాడని, ఆరు నెలలుగా కోమాలో ఉన్నాడని, తలకు బలంగా దెబ్బ తగిలిందని, స్ట్రెస్ తీసుకోవద్దని, తనకే గతం గుర్తుకు రావాలని, ప్రెజర్ తీసుకుంటే మళ్లీ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్ చెబుతాడు. అది విన్న కావ్య ఆయనకు గతం గుర్తుకు తెస్తే ప్రమాదమా. అలా చేయకూడదు అని కావ్య అనుకుంటుంది.

గతం గురించి ఏదైనా చెప్పాలనుకుంటే చిన్న హింట్ ఇచ్చి వదిలేయాలి, డీప్‌గా ఆలోచించేలా చేయకూడదు. రామ్ మీ బ్రెయిన్‌కు అస్సలు స్ట్రెస్ ఇవ్వద్దు అని డాక్టర్ అంటాడు. సరే అలాగే చేస్తాను. ఎక్కువగా ఆలోచించను అని రాజ్ అంటాడు. ఏంటండి ఈ పరిస్థితి నేను మీ కళ్ల ముందుకు వచ్చినా ఎవరో తెలియని వ్యక్తినా మీరు. మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకుని ఏడవాలని ఉంది అని కావ్య బాధపడుతుంది. తర్వ...