Hyderabad, మార్చి 21 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌కు దీపం వెలిగించబోయిన రుద్రాణి గొంతు పట్టుకుని గోడకు పెట్టి నులిమేస్తుంటుంది కావ్య. ఇంట్లోవాళ్లు ఎవరు ఆపిన ఆగదు. ఊపిరాడక విలవిల్లాడుతుంది రుద్రాణి. తర్వాత కావ్యను వెనక్కి లాగుతారు ఇంట్లోవాళ్లు.

ఊపిరి అందడం లేదు కదా. చచ్చిపోతామని భయం వేసింది కదా. బతికున్న నా భర్త ఫొటోకు దీపం పెడుతున్న నాకు అదే అనిపిస్తుంది. నీకు ఇదే చివరి వార్నింగ్. లేకుంటే ఊరుకోను అని కావ్య అంటుంది. లేకపోతే ఏం చేస్తావ్. ఇలాగే పీక పిసికి చంపేస్తావా అని రుద్రాణి అంటుంది. నా భర్త కోసం ఎంత దూరమైన వెళ్తాను అని కావ్య అంటుంది. సరే రాజ్ బతికే ఉన్నాడంటున్నావ్ కదా. ఎక్కడున్నాడు. ఏం చేస్తున్నాడు. ఎవరో అమ్మాయితో ఎక్కడికో ఎందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రావాలిగా. ఎందుకు రాలేదు అని రుద్...