భారతదేశం, మార్చి 19 -- రుద్రాణి మాట‌లు న‌మ్మి రాజ్‌కు క‌ర్మ‌కాండ‌లు జ‌రిపిస్తుంటారు కుటుంబ‌స‌భ్యులు. రాజ్ ఫొటోను చూస్తూ అప‌ర్ణ ఎమోష‌న‌ల్ అవుతుంది. న‌న్ను అమ్మ అని ఎవ‌రు పిలుస్తారు. ఇక ఎప్ప‌టికీ ఆ పిలుపు విన‌బ‌డ‌నంత దూరంగా రాజ్ వెళ్లిపోయాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. దుగ్గిరాల కుటుంబ‌స‌భ్యులు అంద‌రూ ఎమోష‌న‌ల్ అవుతారు. కానీ రుద్రాణి మాత్రం లోలోన సంబ‌ర‌ప‌డుతుంది.

రాజ్ దూర‌మ‌య్యాడు కాబ‌ట్టి ఆస్తికి త‌న కొడుకు రాహుల్ వార‌సుడు అవుతాడ‌ని ఆనందం ప‌ట్ట‌లేక‌పోతుంది. క‌ర్మ‌కాండ‌లు పూర్త్యే వ‌ర‌కు అయినా బాధ ప‌డుతున్న‌ట్లుగా యాక్టింగ్ చేయ‌మ‌ని త‌ల్లికి స‌ల‌హా ఇస్తాడు రాహుల్‌.

క‌ర్మ‌కాండ‌ల‌కు సంబంధించిన మంత్రాలు వినిపించ‌డంతో కావ్య బ‌య‌ట‌కు వ‌స్తుంది. రాజ్ ఫొటోకు దండ వేసి ఉండ‌టం చూసి షాక‌వుతుంది. ఆపండి అని గ‌ట్టిగా అరుస్తుంది. క‌ర్మ‌కాండ‌లు ఈ లోకంలో...