భారతదేశం, మార్చి 18 -- Brahmamudi March 18th Episode: రాజ్ బ‌తికే ఉన్నాడ‌ని, తాను చూశాన‌ని కావ్య ఎంత చెప్పిన కుటుంబ‌స‌భ్యులు న‌మ్మ‌రు. మ‌రోవైపు రాజ్‌ను రామ్‌గా మార్చేసిన యామిని అత‌డి ఫారిన్ తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తుంది. రాజ్‌పేరిట దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది. రాజ్‌కు గ‌తం గుర్తొస్తే నిన్ను క్ష‌మించ‌డ‌ని త‌ల్లిదండ్రులు ఎంత చెప్పిన యామిని విన‌దు.

ఇక్క‌డే ఉంటే రాజ్‌కు అత‌డికి కుటుంబం ఎదురుకావ‌చ్చున‌ని, గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని అంటుంది. రాజ్‌ను ఫారిన్ తీసుకెళ్లి అక్క‌డే అత‌డిని పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు త‌న ప్లాన్‌ను త‌ల్లిదండ్రుల‌కు చెబుతుంది. రాజ్‌కు గ‌తం గుర్తుకు రాకుండా తాను జాగ్ర‌త్త ప‌డుతాన‌ని అంటుంది.

యామిని ఫారిన్ వెళ్ల‌డానికి ఆమె త‌ల్లిదండ్రులు ఒప్పుకోరు. మాకు ఉన్న‌దానికి నువ్వు ఒక్క‌దానివేన‌ని ఆ...