Hyderabad, మార్చి 17 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌ను కావ్య చూసి దగ్గరికి వస్తుంది. ఏవండి అని పిలవబోయి కళ్లు తిరిగి రాజ్ దగ్గర పడిపోతుంది. అది చూసిన రాజ్ కంగారుపడిపోతాడు. ఏవండి, ఎవరండి మీరు, ఏమైంది అని రాజ్ అంటాడు. ఇంతలో చుట్టుపక్కల వాళ్ల వస్తారు.

సన్ స్ట్రోక్ అయిండొచ్చు అని ఒకరంటే.. డైటింగ్ పేరుతో తినట్లేదు. నీరసం వచ్చి పడిపోయింటుందని ఇంకొకరు అంటారు. అంబులెన్స్‌కు కాల్ చేస్తే ఆలస్యం అవుతుందని ఒకతను అంటాడు. అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే కానీ హెల్ప్ చేయరు అని రాజ్ అంటాడు. నీకు కారు ఉందిగా. నువ్వే తీసుకెళ్లొచ్చుకదా అని అతను అంటే.. నేనే తీసుకెళ్తా అని రాజ్ అంటాడు. కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు రాజ్. తనను స్ట్రెచ్‌పై రాజ్ తీసుకెళ్లడాన్ని చూసి చూడనట్లుగా చూస్తుంది కావ్య.

ఇంతలో డాక్టర్ వచ్చి తీ...