Hyderabad, మార్చి 15 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో దుగ్గిరాల ఇంట్లో రాజ్ గురించే అంతా బాధపడుతుంటారు. కావ్యకు స్వప్న పాలు ఇస్తే తాగదు. ఇలా ఏం తినకుండా, తాగకుండా ఎలా ఉంటే చెప్పు అని స్వప్న అంటుంది. ఇంతలో రిపోర్ట్స్ అంటూ కానిస్టేబుల్ వస్తాడు.

ఏంటమ్మా అది అని సుభాష్ అడుగుతాడు. రాత్రి అక్క చెప్పినదాన్ని బట్టి నాకు అనుమానం వచ్చి బావగారి షర్ట్‌పై ఉన్న రక్తపు మరకలను ఫొరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌కు పంపించాను అని అప్పు అంటుంది. పోలీస్ అయ్యాక నీకు బాగా అనుమానాలు పెరిగిపోయాయి అని రుద్రాణి అంటుంది. మీరు నోరు మూసుకుంటారా. ముందు అందులో ఏముందో చెప్పవే అని స్వప్న అంటుంది. ఆ రిపోర్ట్స్ చూసిన అప్పు షాక్ అవుతుంది.

ఏంటమ్మా ఏం వచ్చింది రిపోర్ట్ అని ప్రకాశం అడుగుతాడు. ఏమొస్తుంది. దాని కళ్లు చూస్తే తెలియట్లేదు ఆ రిపోర...