Hyderabad, మార్చి 13 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ ఇక మనకు లేడు.. లేడు. కావ్యల కాకుండా నిజాన్ని చూడండి అని రుద్రాణి అంటుంది. దాంతో ఏడుస్తూ అపర్ణ వెళ్లిపోతుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా. కొడుకును పోగొట్టుకుని ఆ తల్లి ఏడుస్తుంటే నీ మాటలతో రాబందులా పీక్కుతింటున్నావ్. ఇంతకంటే మనుషులను చంపేయడమే మంచిదే ఛీ ఛీ. మనిషి పుట్టుక పుట్టావ్. ఎందుకే ఛీ.. అని వెళ్లిపోతుంది ఇందిరాదేవి.

నువ్వింకా మారవు అని ప్రకాశం అనేసి వెళ్లిపోతాడు. అందరూ వెళ్లిపోతారు. నువ్ పనికిరాని పనులు చేస్తున్నా. నీలో ఎక్కడోచోట మానవత్వం ఉందనుకున్నా. ప్రతిసారీ రాంగ్ అని ప్రూవ్ అని చేస్తున్నావ్. ఇలా బతకడం కన్నా చావడం మేలు అని స్వప్న వెళ్లిపోతుంది. అనవసరంగా వాగి అమ్మమ్మతో చెంపదెబ్బ తిన్నావ్. సైలెంట్‌గా ఉండొచ్చు కదా అని రాహుల్ అంటాడు. చ...