భారతదేశం, మార్చి 12 -- Brahmamudi March 12th Episode: గ‌తం మ‌ర్చిపోయిన రాజ్‌ను త‌న సొంతం చేసుకోవ‌డానికి క‌న్నింగ్ ప్లాన్ వేస్తుంది యామిని. రాజ్‌ను రామ్‌గా మార్చేస్తుంది. మ‌రోవైపు రాజ్ చ‌నిపోయాడంటే కావ్య న‌మ్మ‌దు.ష‌ర్ట్ మాత్ర‌మే దొరికిందంటే ఆయ‌న ఉన్నార‌నే అర్థ‌మ‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో వాదిస్తుంది. అంద‌రం క‌లిసి వెతికితే రాజ్ త‌ప్ప‌కుండా దొర‌కుతాడ‌ని అంటుంది.

అడ‌విలో దారి తెలియ‌క రాజ్ త‌ప్పిపోయి ఉంటాడ‌ని, మ‌నం వెళ్లి వెంట‌నే కాపాడుదామ‌ని గోల‌గోల చేస్తుంది. రాజ్‌ను వ‌దిలి ఉండ‌లేన‌ని అంటుంది. మీరు వ‌చ్చిన రాక‌పోయినా రాజ్‌నే తానే తీసుకొస్తాన‌ని బ‌య‌లుదేర‌బోతుంది. కావ్య మాట‌ల‌తో అంద‌రూ క‌న్నీళ్లు పెట్టుకుంటారు.

అప్పుడే డాక్ట‌ర్ అక్క‌డికి వ‌స్తాడు. కావ్య స్పృహ‌లోకి వ‌స్తే ఎవ‌రి మాట విన‌డం లేద‌ని, హాస్పిట‌ల్ నుంచి వెళ్లిపోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుం...