భారతదేశం, మార్చి 11 -- Brahmamudi March 11th Episode: రాజ్‌ను యాక్సిడెంట్ స్పాట్ నుంచి మాయం చేసి సీక్రెట్‌గా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తుంది యామిని. రాజ్ గ‌తం మ‌ర్చిపోయిన‌ట్లు డాక్ట‌ర్ చెబుతాడు. డాక్ట‌ర్ మాట‌ల‌తో తొలుత షాక‌వుతుంది యామిని. ఆ త‌ర్వాత కొత్త స్కెచ్ వేస్తుంది.రాజ్ అంద‌రిని మ‌ర్చిపోయి న‌న్ను మాత్ర‌మే ప్రేమించ‌డానికి వ‌చ్చాడ‌ని అనుకుంటుంది. నా ప్రేమ నాకు దూర‌మైంద‌ని బాధ‌ప‌డుతుంటే ఆ బాధ చూడ‌లేక న‌న్ను, నా ప్రేమ‌ను దేవుడు గెలిపించాడ‌ని త‌ల్లిదండ్రుల‌తో చెబుతూ ఆనంద‌ప‌డుతుంది యామిని.

మ‌రోవైపు రాజ్ ఏమైందో తెలియ‌క అప‌ర్ణ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను ఇందిరాదేవి, ప్ర‌కాశం ఓదార్చుతారు. మ‌రోసారి అంద‌రం క‌లిసి లోయ‌లో వెతుకుదామ‌ని ప్ర‌కాశం అంటాడు. క‌ళ్యాణ్ అక్క‌డికి వెళ్లివ‌చ్చాడ‌ని అప్ప‌టి నుంచి త‌న‌లో తానే కుమ‌లిపోతున్నాడ‌ని ధాన్య‌ల‌క్ష్మి...