Hyderabad, మార్చి 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో యాక్సిడెంట్ అయిన స్పాట్ నుంచి ఒక్క కావ్యనే తీసుకొచ్చారని డాక్టర్ చెబుతాడు. దాంతో సుభాష్ వాళ్లు షాక్ అవుతారు. మరోవైపు పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తిని విచారిస్తుంటారు.

కారు యాక్సిడెంట్ చూడలేదని, కారు బోల్తా పడి ఉండటం చూశానని, కారులో అమ్మ గారిని రక్తపు మడుగులో చూసి భయంతో కాల్ చేసినట్లు అతను చెబుతాడు. ఇంతలో వచ్చిన అపూర్వ కారులో ఇంకెవరినైనా చూశారా అని అడుగుతుంది. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కదా. కాసేపు వెయిట్ చేయమని ఎస్సై అంటే.. అపూర్వ తన ఐడీ కార్డ్ చూపిస్తుంది. కారులో మా అక్క బావ ఇద్దరు ఉండాలి. ఒక్కరే వచ్చారు. బాగా గుర్తు తెచ్చుకోండి అని అప్పు అంటుంది.

కారులో ఇంకెవరు లేరు. నాకు బాగా గుర్తు అని అతను చెబుతాడు. ఏంటీది అప్పు అన్నయ్య కనిపించడకపో...