Hyderabad, జనవరి 31 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో డిజైనర్స్ కంటే బిజినెస్ మ్యాన్ గొప్ప అని కస్టమర్స్‌తో చెప్పిస్తా అని రాజ్ అంటాడు. తర్వాత కావ్య డిజైన్స్ ఫొటో తీసి ఎవరికో పంపిస్తాడు. దాంతో దీన్ని ఎంతకు అమ్మొచ్చు. ఒక పాతిక లక్షలు అని కావ్య అంటుంది. నువ్ అలాగే చూస్తూ ఉండు ఒక బిజినెస్ మ్యాన్‌గా దీని వాల్యూ ఎలా పెంచుతానో చూడు అని రాజ్ అంటాడు.

తర్వాత సూరజ్‌కు కాల్ చేసి మనం వేళంలో పెట్టిన నెక్లెస్ వ్యాల్యూ నేను చెప్పేవరకు పెంచుతూనే ఉండు అని రాజ్ చెబుతాడు. ఆక్షన్‌లో గ్రీన్ స్టోన్‌తో స్పెషల్‌గా తయారు చేసిన ఒకే ఒక్క నెక్లెస్ ఉంది. ఒక్కసారి ఇది అమ్ముడుపోతే మళ్లీ మీరు కావాలనుకున్న దొరకదు. ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ పీస్‌ ఒక్కటే రెడీ చేసింది అని రాజ్ కంపనీ అతను చెబుతాడు. కంపెనీ పాట రూ. 30 లక్షలు...