Hyderabad, జనవరి 30 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆస్తి కోసం కోర్టులో కేసు వేయనని కల్యాణ్ ఫైర్ అవుతాడు. ధాన్యలక్ష్మీ, ప్రకాశంపై కోప్పడతాడు. నాకు ఇంటి వారసత్వం కావాలి, ఇంటి తాలుకు మంచితనం కావాలి, ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం కావొద్దనే తాతయ్య ఆశయం కావాలి. బంధాలే ఆస్తి అంటే, అనుబంధాలే ఐశ్వర్యం అంటే అని కల్యాణ్ అంటాడు. దాంతో శభాష్ కల్యాణ్ బాగా చెప్పావ్ అని స్వప్న అంటుంది.

ఏమైయిపోయాయమ్మా అప్పటి మమతలు, పెద్దమ్మను అక్కలా, అమ్మమ్మను తల్లిలా, తాతయ్యను తండ్రిలా చూసే నువ్వు ఎక్కడ తప్పడడుగు వేశావ్. ఆస్తులు ఆత్మీయతను మింగేశాయా అని డైలాగ్‌లతో ఇచ్చిపడేస్తాడు కల్యాణ్. ఈ మాట మీ అమ్మను కాదు మా అత్తను అడుగు కల్యాణ్ అని స్వప్న అంటుంది. ఇందిరాదేవి లేచి చాలురా. నాకు ఈ మాటలు చాలు. ఆస్తి కోసం భార్య వైపు మాట్లాడిన మీ నాన...