భారతదేశం, జనవరి 29 -- Brahmamudi: ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి ఆస్తిలో వాటాల కోసం కోర్టుకు వెళ‌తామ‌ని అన‌డంతో ఏం చేయాలో అర్థంకానీ ప‌రిస్థితుల్లో ప‌డుతుంది కావ్య‌. ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మిని కోర్టుకు వెళ్ల‌కుండా ఆప‌మ‌ని సుభాష్‌ను రిక్వెస్ట్ చేస్తుంది. చేసేది నువ్వు...ఆపేది మేమా అంటూ కావ్య‌పై ఫైర్ అవుతుంది అప‌ర్ణ‌.

నిన్ను న‌మ్మి ఆస్తి నీ చేతుల్లో పెడితే ఎవ‌రికి అడిగే హ‌క్కు లేద‌ని నోరు మూయించావు...ఇప్పుడు మేము ఏం చేయ‌లేమ‌ని వాళ్ల‌ను కోర్టుకు వెళ్ల‌కుండా ఆప‌డం క‌ష్ట‌మ‌ని అప‌ర్ణ అంటుంది. ఈ విష‌యంలో నీకు మేము సాయం చేయ‌లేమ‌ని కావ్య‌కు ఇద్ద‌రు చెప్పేస్తారు.

ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి కోర్టుకు వెళుతున్నార‌ని తెలిసి రాజ్ టెన్ష‌న్ ప‌డుతుంటాడు. వాళ్ల‌ను ఎలా ఆపాలో తెలియ‌డం లేద‌ని కావ్య‌తో అంటాడు. రుద్రాణి అత్త ఈ డ్రామా ఆడిస్తుంద‌ని అర్థ‌మైపోతుంద‌ని ఫైర్ ...