భారతదేశం, జనవరి 28 -- Brahmamudi బ‌ట్ట‌లు ఆరేసే తీగ‌కు క‌రెంట్ క‌నెక్ష‌న్ ఇచ్చి కావ్య‌ను చంపాల‌ని రాహుల్ ప్లాన్ చేస్తాడు. కొడుకు ప్లాన్ గురించి తెలియ‌క రుద్రాణి బ‌ట్ట‌లు అరేయ‌డానికి వెళుతుంది. క‌రెంట్ షాక్ కొట్ట‌డంలో ల‌బోదిబోమ‌ని అరుస్తుంది. క‌రెంట్ షాక్ నుంచి బ‌య‌ట‌ప‌డేసే నెపంతో అత్త‌ను క‌ర్రతో చిత‌క్కొడుతుంది స్వ‌ప్న‌. రాహుల్ ప‌వ‌ర్ ఆఫ్ చేయ‌డంలో రుద్రాణి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డుతుంది.

మీ అమ్మ‌ను నేనే బ‌తికించాను, జీవితాంతం మీరిద్ద‌రు నాకు రుణ‌ప‌డి ఉండాల‌ని రాహుల్‌తో అంటుంది స్వ‌ప్న‌.క‌రెంట్ షాక్ ఐడియా వేసిన రాహుల్‌పై కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది రుద్రాణి. చెత్త ఐడియాలు వేస్తావా అని ప‌క్క‌నే క‌ర్ర తీసుకొని దంచుతుంది.

అప్పు పోలీస్ ట్రైనింగ్‌కు తిరిగి బ‌య‌లుదేరుతుంది. ఆమె బ్యాగ్‌ను క‌ళ్యాణ్ స‌ర్ధుతుంటాడు. ఈ ట‌వ‌ల్ పెట్టు, ఆ డ్రెస్ పెట్టు అని క‌ళ్...