Hyderabad, ఫిబ్రవరి 23 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో పోలీస్ స్టేషన్‌లో రాజ్‌ను ఇన్వెస్టిగేట్ చేసిన అప్పు ఇంటికి వస్తుంది. రాగానే, అనామిక ఎలాంటిదో తెలిసి కూడా రాజ్‌ను అరెస్ట్ చేస్తావా, ఇందుకేనా నిన్ను నా కొడుకు పోలీస్‌ను చేసింది అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ.

ధాన్యలక్ష్మీకి సపోర్టింగ్‌గా రుద్రాణి సెటైర్లు వేస్తుంది. దీంతో ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎంత పేరు వచ్చింది అని వెటకారంగా అంటుంది. నేను నా డ్యూటీ చేశాను అని అప్పు చెప్పిన వినిపించుకోరు. దాంతో కల్యాణ్‌తోపాటు అంతా అందులో తను చేసిందేం లేదని సపోర్ట్ చేస్తారు. అప్పును తప్పుపట్టడంలో అర్థం లేదని అంటారు.

మరుసటి రోజు సామంత్ మర్డర్ కేసుపై కోర్టులో వాదనలు జరుగుతాయి. అనామిక తరఫు లాయర్ కావ్యను విచారించాల్సిందిగా కోరడంతో బోనులోకి వస్తుంది...