Hyderabad, ఫిబ్రవరి 8 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్నకు కావ్య గోరింటాకు పెడుతానంటుంది. అలాగే, ఇంట్లో ఎవరికైనా కావాలంటే చెప్పండి. పెడతాను అని కావ్య అంటుంది. గోరింటాకు పెట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ, ఆరేవరకు ఉండాలంటే చిరాకుగా ఉంటుంది అని రుద్రాణి అంటుంది. దాంతో ఇందిరాదేవి సెటైర్లు వేస్తుంది. ధాన్యలక్ష్మీ నీకు గోరింటాకు ఇష్టం కదా. పెట్టుకో అని అపర్ణ అంటుంది.

నాకు ఇవ్వాల్సింది ఇస్తే చాలు. గోరింటాకు గట్రాలు వద్దు అని ధాన్యలక్ష్మీ అంటుంది. కావ్య ప్రేమగా అడిగింది. పెట్టించుకునేవాళ్లు పెట్టించుకోండి. అంతేగానీ మాటలతో గుచ్చకండి అని స్వప్న అంటుంది. అప్పును కూడా పెట్టుకోమని ఇందిరాదేవి అంటుంది. కల్యాణ్ సరే అనిచెప్పగానే పెట్టుకోడానికి ఒప్పుకుంటుంది అప్పు. దాంతో పెళ్లాన్ని బాగానే కంట్రోల్‌లో పెట...