Hyderabad, ఫిబ్రవరి 6 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మూడు నెలలు వెంటనే జరిగిపోతాయి. స్వప్నకు ఆడపిల్ల పుట్టిందని, కావ్య పిన్ని అయినట్లు అపర్ణ కాల్ చేసి చెబుతుంది. కట్ చేస్తే పాపతో స్వప్న ఇంటికి వస్తే కావ్య హారతి పట్టి, బొట్టి పెట్టి లోపలికి పిలుస్తుంది. పాపను చూసుకుంటూ అంతా మురిసిపోతుంటారు. ఈ తరం నుంచి ఈ ఇంటికి అడుగుపెట్టిన మొట్టమొదటి బిడ్డ. సాక్ష్యాత్తు మహాలక్ష్మి ఇంటికొచ్చినట్లుంది అని ఇందిరాదేవి అంటుంది.

మహాలక్ష్మి వచ్చిన సందర్భంగా ఎవరి ఆస్తి వారికి ఇస్తే బాగుంటుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో ప్రకాశం వారిస్తాడు. ఆయుష్షు ఎంత అవసరమో.. ఆస్తి కూడా అవసరమే కదా అని రుద్రాణి అంటుంది. వాళ్ల గొడవను ఆపి ఇందిరాదేవి మునిమనవరాలితో ఆప్యాయంగా మాట్లాడుకుంటుంది. ఇదంతా మన ఆస్తే. నీ పెళ్లి కూడా ఇక్కడ జరగాలి...