భారతదేశం, ఫిబ్రవరి 5 -- రెండు కోట్ల రూపాయ‌ల్ని బ్యాంకులో డిపాజిట్ చేయ‌డానికి కావ్య‌తో క‌లిసి కారులో వెళుతుంటాడు రాజ్‌. ఆ డ‌బ్బును వారి ద‌గ్గ‌ర నుంచి కొట్టేయాల‌ని రౌడీతో క‌లిసి రాహుల్ స్కెచ్ వేస్తాడు. రాహుల్‌తో డీల్ కుదుర్చుకున్న రౌడీ ..., రాజ్‌, కావ్యల‌ కారును ఫాలో అవుతాడు.

ఎక్కిళ్లు రావ‌డంతో వాట‌ర్ బాటిల్ కొన‌డానికి రాజ్‌ ఓ చోట కారు ఆపుతాడు. అదే టైమ్‌లో రాజ్ కారులోని బ్యాగు కొట్టేసిన రౌడీ బైక్‌పై ప‌రార్ అవుతాడు. బ్యాగ్‌ను తెలివిగా రాహుల్ కారు ద‌గ్గ‌ర ప‌డేస్తాడు. రౌడీ విసిరిన బ్యాగును రాజ్‌, కావ్య‌ల‌కు క‌నిపించ‌కుండా త‌న కారులో దాచేస్తాడు రాహుల్‌.

డ‌బ్బులు కొట్టేసి పారిపోతున్న రౌడీని రాజ్‌, కావ్య క‌లిసి ప‌ట్టుకుంటారు. ఆ రౌడీని రాజ్ చిత‌క్కొడ‌తాడు. త‌మ ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉన్న విష‌యం ఎవ‌రికి తెలియ‌ద‌ని, మ‌న గురించి బాగా తెలిసిన‌వాళ్లే డ‌బ్బ...