Hyderabad, ఫిబ్రవరి 4 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో తనను అపర్ణ నిందించిందని రాజ్ అంటే.. అలా చేయలేదని, వాళ్లు నిందించడానికి వారికి బదులు ఆమె అడిగారని కావ్య చెబుతుంది. దాంతో ఛ.. మామ్‌ను తప్పుగా అపార్థం చేసుకున్నాను అని రాజ్ అంటాడు. మీ అమ్మగారినే కాదు మీరు ఆడవాళ్లందరని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు దీంట్లో కోర్స్ కూడా చేసినట్లు అనిపిస్తుంది అని కావ్య అంటుంది.

ఇద్దరు సరదాగా వాదించుకుంటారు. పడుకునేలోపు మీరు ఏమైనా చేస్తే.. నేను సపోర్ట్ చేద్దామనుకుంటున్నాను అని కావ్య అంటే.. హుమ్.. అని సీరియస్‌గా రాజ్ చూస్తాడు. అదే డబ్బులు లెక్కపెట్టడానికి సపోర్ట్ చేస్తాను అని కావ్య అంటే.. డబ్బు లెక్కపెట్టడం అయిపోయింది. లోపల పెట్టు. రేపు వెళ్లి బ్యాంక్‌లో డిపాజిట్ చేద్దాం అని రాజ్ అంటాడు. బ్యాంక్ లేనప్పుడు డిపాజిట్ ...