Hyderabad, ఫిబ్రవరి 3 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆస్తులు తాకట్టు పెట్టి రాజ్, కావ్య అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారని రుద్రాణి చెబుతుంది. నాకు అన్యాయం జరుగుతుందని రుద్రాణి చెబుతుంది. తను రెచ్చగొడితే రెచ్చిపోవట్లేదు. నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.

సాయంత్రం వచ్చాక అడుగుదాం

బ్రతికించావ్ తల్లి కనీసం ఇప్పటికైనా నా మాటలు నమ్మావ్ అని రుద్రాణి అనుకుంటుంది. చిన్న పిల్లల చేయకు. ఒక కొడుకు తల్లివి అని అపర్ణ అంటుంది. ఆ కొడుకు కోసమే నా తాపత్రయం. అందరి ముందు మాట్లాడి చెడ్డదాన్ని అవుతున్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇప్పుడు ఏంటీ, రాజ్ కావ్య ఆస్తులు తాకట్టు పెట్టి అమెరికా వెళ్తున్నారని అంటారు. సాయంత్రం వచ్చాకా...