Hyderabad, ఫిబ్రవరి 27 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పోలీస్ స్టేషన్‌లో రాజ్‌కు అన్నం తినిపిస్తుంది కావ్య. గుండెనిండా బాధ పెట్టుకుని వెళ్లకు అని రాజ్ అంటే.. లేదు ఇలాంటి సమయంలోనే ఎక్కువ ధైర్యంగా ఉండాలని తెలుసు. నేను అప్పు అదే పనిలో ఉన్నాం సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నాం అని కావ్య అంటుంది.

నువ్వేమైనా సాహసాలు చేస్తున్నావా. నీకేమైనా అయితే నేను జీవితాంతం జైలులోనే ఉండాల్సి వస్తుంది. అంటే నీకేమైనా అయితే నన్నెవరు విడిపిస్తారు అని రాజ్ అంటాడు. అప్పు రేపటిలో సాక్ష్యాలు సంపాదిస్తానని చెప్పింది. నేను ధైర్యంగానే ఉంటాను అని చెప్పిన కావ్య రాజ్‌ను హగ్ చేసుకుని వెళ్లిపోతుంది. మరుసటి రోజు కోర్టులో అంతా వస్తారు. నిన్ను ఎవరైనా నేరం ఒప్పుకోమ్మని బలవంతం పెట్టారా, సమయానికి భోజనం పెడుతున్నారా అని జడ్జ్ రాజ్‌ను అడుగుత...