Hyderabad, ఫిబ్రవరి 25 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో సామంత్‌కు వార్నింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన వెళ్లారు. చంపాలన్న ఉద్దేశంతో కాదు అని కావ్య అంటుంది. వార్నింగ్ ఏమైనా ఇచ్చారా అని అనామిక లాయర్ అంటాడు. ఇంకోసారి ఇలా చేస్తే.. అని తటాపటాయించిన కావ్యతో చంపేస్తామన్నారు అంతేనా అని లాయర్ అంటాడు.

అవును అని కావ్య అనేసరికి అంతా షాక్ అవుతారు. కోపంలో ఏదో అన్నారు అంతే గానీ అని కావ్య అంటే.. అంతేగానీ ఇక మీరు వెళ్లొచ్చు. నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని పీపీ అంటాడు. దాంతో కావ్య వెళ్లిపోతుంది. ఈ కేసులో ఈ పాయింట్ చాలా ముఖ్యం. ముద్దాయికి సామంత్‌ను చంపాలన్న కోపం ఉంది. కానీ, అక్కడ చాలా మంది ఉండటంతో పక్కా ప్లాన్ చేసి చంపాడు. తర్వాత శవాన్ని కారు డిక్కీలో పెట్టుకుని మాయం చేసేందుకు తీసుకెళ్తాడు. అంతే యువరానర్ అని పీపీ చెబు...