Hyderabad, ఫిబ్రవరి 24 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంటికి వచ్చిన అప్పును ధాన్యలక్ష్మీ, రుద్రాణి నానా మాటలు అంటారు. ఇంటివాళ్లనే అరెస్ట్ చేసి ఏం మెడల్స్ సాధించావ్. అసలు రాజ్‌ను అరెస్ట్ చేయడానికి ఆ అనామిక దగ్గర ఎంత లంచం పుచ్చుకున్నావ్ అని రుద్రాణి అంటుంది. దాంతో అప్పు ఫైర్ అవుతుంది.

కాస్తా మర్యాదగా మాట్లాడండి. నా ప్రాణం పోయినా అలాంటి పని చేయను. ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చినందుకు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. దయచేసి నన్ను అనుమానించకండి అని అప్పు అంటుంది. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు నిన్ను తీసుకురమ్మని ప్రతి ఒక్కరు నన్ను ఒప్పించారు. ఇప్పుడు నువ్ అక్కకే ఇలా చేశావ్. నిన్ను ఏమనాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. అమ్మా.. అప్పు తన డ్యూటీ చేసింది. అలా చేయకుంటే జాబ్‌కు ద్రోహం చేసినట్లు అవుతుంది అని కల్యాణ్ అంటా...