Hyderabad, ఫిబ్రవరి 21 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ ఇద్దరు పెట్రోల్ పోస్తుంటారు. రాజ్‌ను చూసి పారిపోతారు. రాడ్ పట్టుకుని రాజ్ పరుగెత్తుతాడు. కానీ, వాళ్లు తప్పించుకుంటారు. రాజ్ పట్టుకున్న రాజ్ అక్కడే పడేస్తాడు. వాచ్‌మెన్‌కు ఏం కాలేదని అడిగి.. జాగ్రత్తగా ఉండమని వెళ్లిపోతాడు.

మరోవైపు ఇంట్లో అందరి సంతోషం చూసి తట్టుకోలేకపోతుంది రుద్రాణి. ఇంకా వీళ్లను ఏం చేయలేనా. వీళ్ల సంతోషానికి సమాధి కట్టలేనా అని దేవుడుని అడుగుతుంది. ముందు అనామికకు కట్టాలి సమాధి అనుకున్న రుద్రాణి కాల్ చేస్తుంది. ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నారని, ఇది చూడటానికేనా నేను బతికుంది. పాములా పగబడతావనుకుంటే మన్ను తిన్న పాములా పడుకుండిపోయావ్ అని రుద్రాణి చెబుతుంది.

కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు చూసుకోండి అని ...