Hyderabad, ఫిబ్రవరి 1 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంట్లో నాకు వీసా కావాలి, నా వైఫ్‌కి పాస్‌పోర్ట్ అండ్ వీసా రెండు కావాలి, పాస్ట్ పోర్ట్ సైజ్ ఫొటో కూడా కావాలి అని ఫోన్‌లో రాజ్ మాట్లాడుతుంటాడు. ఆ మాటలు రుద్రాణి చాటుగా వింటూ ఉంటుంది. ఇదేంటీ పాస్‌పోర్ట్, వీసా అంటున్నాడు. దేనికోసం అయింటుంది. హనీమూన్‌కు వెళ్తున్నారా. లేదు ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకుని వెళ్లరు. ఇంకేదే అయింటుందని రుద్రాణి డౌట్ పడుతుంది.

అవునండీ.. అమెరికా వెళ్లాలి. టైమ్ కూడా లేదు. ఒక్క నెలలో ప్రాసెస్ అంతా జరిగిపోవాలి అని రాజ్ అంటాడు. ఇదేదో ఇంట్లో వాళ్లందరిని ముంచేసే ప్లానే. డౌటే లేదు. ఇద్దరు తోడుదొంగల్లా ఉన్నదంతా దోచుకుని విదేశాల్లో సెటిల్ అయిపోదామనుకుంటున్నారు అని అనుమానించిన రుద్రాణి వెళ్తుంది. అక్కడ కావ్య 31 రోజుల్లో ఆంగ్లం ఎలా ...