Hyderabad, ఫిబ్రవరి 19 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రుద్రాణి, రాహుల్‌ను వెళ్లగొడదామని ఇందిరాదేవి చెబుతుంది. ఆస్తి పంచి పంపించమని రుద్రాణి అంటుంది. ఈ మాట అంటావా లేదా అనే ఇప్పటిదాకా ఆగాను. అపాత్ర దానం చేయదలుచుకోలేదు. బయటకు వెళ్లిపో అని సీతారామయ్య అంటాడు. ఇగోకు పోతే అడుక్కు తినాలని అనుకున్న రుద్రాణి సీతారామయ్య కాళ్లపై పడుతుంది.

నన్ను క్షమించండి నాన్నా. ఇప్పటివరకు నా వల్ల గొడవలు వచ్చాయని అంతా అంటున్నారు. అది నా నోటి దురుసువల్ల అని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మేము ఏమైపోతాం. నా కోడలు, దానికి పుట్టినదాని మొహం చూసైనా ఇంట్లో ఉండనివ్వండి అని రుద్రాణి వేడుకుంటుంది. అయ్యయ్యో నాకోసం అంతలా కంగారుపడాల్సిన అవసరం లేదు. నన్ను బయటకు వెళ్లమనట్లే. మిమ్మల్ని మాత్రమే అంటున్నారు. నేను నా చెల్లెల్లితో కలిసి ఇంట్లోనే ఉం...