Hyderabad, ఫిబ్రవరి 18 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆస్తి సమస్య తీరలదేని, ఆస్తి ముక్కలు చేసి ఎవరి వాటా వాళ్లకు పంచాలని అనుకుంటున్నట్లు సీతారామయ్య చెబుతాడు. దాంతో ప్రకాశం తండ్రి కాళ్లమీద పడి క్షమించమని అడుగుతాడు. తమ్ముడు అమాయకంగా ఉంటాడు, ఆస్తి నిలుపోకోలేకపోతే మళ్లీ కష్టాలు పడాలని సుభాష్ అంటాడు.

ఇదేంటీ అందరూ కలిసి ఆస్తి పంపకాలు జరగనిచ్చేలా లేరు. ముసలోడు ఆస్తి పంచడా ఏంటీ అని రుద్రాణి భయపడుతుంది. తప్పులు అందరూ చేస్తారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు అందరూ మనతో ఉంటేనే ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే బాధపడతాం అని ఇందిరాదేవి అంటుంది. సరే. ఇదే వీళ్లకు నేనిచ్చే చివరి అవకాశం. మళ్లీ ఆస్తి గురించి చీలికలు రావొద్దు అని సీతారామయ్య ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు. రావు, రావు నాన్న అని ప్రకాశం అంటాడు.

కలిసి ఉండటం అంటే మనమే ...