Hyderabad, ఫిబ్రవరి 15 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఎస్ఐని ఫాలో అవుతూ అప్పు వెళ్తుంది. ఇక్కడ పరిస్థితి బాగోలేదు అని కావ్యకు అప్పు చెబుతుంది. ఎలాగోలా వాళ్లను టైమ్ ఇవ్వమని అడుగు, నందగాడు బతికి ఉన్నాడని టైమ్ తీసుకోండి అని అప్పు అంటుంది. ఇదివరకు ఓసారి ఇలాగే చేసి ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు వాడిని చూస్తేగానీ నమ్మరు అని కావ్య అంటుంది.

అర్థమైంది అక్క. నేను చూసుకుంటాను. ఆ నందగాడితోనే వస్తుంది అని అప్పు అంటుంది. ఇంతలో వచ్చిన రాజ్ ఏమంటుంది అని అడుగుతాడు. నందగాడు కచ్చితంగా దొరుకుతాడని చెబుతుంది అని కావ్య అంటుంది. దొరకాలి, లేకుంటే మనం కుటుంబం రోడ్డునపడుతుంది. నందగాడు కనిపిస్తే మాత్రం చంపేస్తాను. పాపం తాతయ్య మంచి మనసుతో సంతకం పెడితే ఇలా జరిగిందని బాధపడుతున్నాడు అని రాజ్ అంటాడు. కూల్‌గా ఉండండి, ఏమైనా చేస్తే మనక...