Hyderabad, ఫిబ్రవరి 14 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అప్పు కోసం పోలీస్ స్టేషన్‌కు కల్యాణ్ లంచ్ క్యారేజ్ తీసుకొని వెళ్తాడు. దానికి అప్పు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. నువ్ తీసుకురావడం బాగుంటుందా అని అప్పు అంటుంది. నా బంగారం కోసం తీసుకొచ్చా. పిల్లలను కనే విషయంలో తప్పా ఇంకే విషయంలో ఆడ, మగ తేడా ఉండకూడదు అని కల్యాణ్ అంటాడు.

దాంతో పక్కనే ఉన్న కానిస్టేబుల్ పురుషుల్లో పుణ్యపురుషుడు మీరు సార్. నా మొగుడు ఉన్నాడు. అన్ని పనులు నేనే చేయాలి. పైగా పురుష అహంకారం చూపిస్తాడు. మీలాంటి భర్త దొరకడం మేడమ్ అదృష్టం సర్. వచ్చే జన్మలో అయినా మీలాంటి భర్త దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కానిస్టేబుల్ అంటుంది. దాంతో చాల్లే అని వెళ్లమంటుంది అప్పు. తర్వాత క్యాబిన్‌కు కల్యాణ్‌ను తీసుకెళ్తుంది. నా ముందే నా మొగుడుని పొగుడు...