భారతదేశం, ఫిబ్రవరి 11 -- స్వ‌ప్న కూతురు బార‌సాల ఫంక్ష‌న్‌ను దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ క‌లిసి సంతోషంగా సెల‌బ్రేట్ చేస్తుంటారు. స‌డెన్‌గా అక్క‌డికి ఎంట్రీ ఇస్తుంది అనామిక‌. రాజ్‌, కావ్య క‌లిసి వంద కోట్లు అప్పు చేశార‌ని బాంబు పేల్చుతుంది. అనామిక‌ మాట‌ల‌తో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ షాక‌వుతారు. ఆ వంద కోట్ల అప్పుల‌ను తీర్చ‌డానికి మీ ఆస్తుల‌ను తాక‌ట్టు పెడుతున్నార‌ని, ఇంట్లో ఖ‌ర్చుల‌ను త‌గ్గిస్తున్నార‌ని అనామిక అంటుంది.

అనామిక మాట‌లు నిజ‌మ‌ని ధాన్య‌ల‌క్ష్మి, రుద్రాణితో పాటు మిగిలిన దుగ్గిరాల కుటుంబ‌స‌భ్యులు న‌మ్ముతారు. ఇంట్లో కావ్య పెట్టిన రూల్స్‌కు వంద కోట్ల అప్పే కార‌ణ‌మ‌ని రుద్రాణి గుండెలు బాదుకుంటుంది. అనామ‌కురాలి మాట‌లు న‌మ్మి రుద్దాంతం చేస్తే బాగుండ‌ద‌ని రుద్రాణి గొడ‌వ‌ను ఆపేస్తుంది ఇందిరాదేవి. అనామిక చెప్పింది అబ‌ద్ద‌...