Hyderabad, ఫిబ్రవరి 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నువ్ ఏం చేయలేకపోతున్నావ్ అని అనామికకు కాల్ చేసి రుద్రాణి అంటుంది. మృగాలు సైలెంట్‌గా ఉన్నాయంటే చావ చచ్చిపోయిందని కాదు, అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయని, నేను కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. రాజ్‌ను ఎక్కడ లాక్ చేయాలో అక్కడే లాక్ చేసుకుంటూ వచ్చాను. రాజ్, కావ్య వాళ్లకు తెలియకుండానే నా కంట్రోల్‌లో ఉన్నారు అని అనామిక అంటుంది.

స్క్రీన్‌ప్లే అంతా నేను రాసినట్లే జరుగుతుంది. ఈసారి మనం దించబోయే బుల్లెట్ పాయింట్ బ్లాక్‌లో పెట్టినట్లు ఉంటుంది. ఈ రాత్రికి ఏసీ వేసుకుని హాయిగా పడుకోండి. రేపు మీ మనవరాలి బారసాల టైమ్‌లో నేను రాబోతున్నాను. బాంబ్ పేల్చబోతున్నాను. రేపు నేను కొట్టబోయే దెబ్బకి మీ దుగ్గిరాల కుటుంబం కుదేలు అయిపోతుంది. కళ్లప్పగించి చూడటానికి ఎదురుచూ...