భారతదేశం, ఏప్రిల్ 8 -- శ్రీరామ నవ‌మికి సీతారాముల క‌ళ్యాణం జ‌రిపించాల‌ని దుగ్గిరాల ఫ్యామిలీ అనుకుంటారు. క‌ళ్యాణంలో జంట‌లుగా కూర్చోవాల‌ని దుగ్గిరాల కుటుంబ స‌భ్యుల‌కు పూజారి చెబుతాడు. రాజ్ ఫొటో తీసుకొచ్చి త‌న ప‌క్క‌న పెట్టుకొని పీట‌ల‌పై కూర్చోబోతుంది కావ్య‌. వాటే టాలెంట్..నీ ఐడియాకు నా ఫ్యూజులు ఎగిరిపోయాయ‌ని రుద్రాణి సెటైర్లు వేస్తుంది.

కావ్య‌ను పీట‌ల‌పై కూర్చోకుండా ఆపుతుంది. నీ పిచ్చితో వెర్రితో స్వామి వారిని అవ‌మానిస్తే ఊరుకునేది లేద‌ని కావ్య‌కు వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. దంప‌తులు కూర్చోవాలి కానీ ఇలా ఫొటోలు, ఫ్రేముల‌ను ప‌క్క‌న పెట్టుకొని కూర్చుంటానంటే కుద‌ర‌ద‌ని రుద్రాణి ర‌చ్చ చేస్తుంది. ఈ మూర్ఖురాలికి మీరైనా బ్రెయిన్ వాష్ చేయండి అని పూజారితో అంటుంది రుద్రాణి.

ఒక్క‌రోజు కూడా పూజ చేయ‌ని మీరు మ‌న సంప్ర‌దాయాల గురించి మాట్లాడుతుంటే విడ్డూర...