Hyderabad, ఏప్రిల్ 7 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో హాల్లో అందరికి కావ్య హారతి ఇస్తుంది. ఇవాళ శ్రీరామనవమి. ప్రతిరోజు గుడికి వెళ్లి పూజలు జరిపిస్తున్నాం కదా. వెళ్దామని కావ్య చెబుతుంది. గతేడాది మా వదిన గొప్పలకు పోయి మీ ఇద్దరి చేతుల మీదుగా జరిపించింది. ఇప్పుడు మీ కొడుకు ఏడని అడిగితే ఏమని సమాధానం చెబుతారు అని రుద్రాణి అంటుంది.

ఆ సమాధానాలు నేను చెబుతాను. మావయ్య అన్నీ రెడీ అయ్యాయి. అందరూ రెడీ అవ్వమని కావ్య అంటుంది. ఇప్పుడెందుకు ఇవన్నీ చేస్తున్నావ్. ఇంటి పరువు తీయడానికి కాకపోతే అని రుద్రాణి అంటుంది. కావ్య ఎప్పుడు అలా చేయదని సుభాష్ అంటాడు. రుద్రాణికి సపోర్ట్ చేస్తున్నానని కాదు తను చెప్పింది కూడా కరెక్టే కదా. ఇప్పటివరకు మనమధ్యే ఉన్న రాజ్ విషయం నలుగురిలోకి వెళితే అది పరువు సమస్య అవుతుంది కదా అని ధాన్యలక్...