Hyderabad, ఏప్రిల్ 3 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ దగ్గరి నుంచి అర్జంట్‌గా వెళ్లాలలని కావ్య వెళ్లిపోతుంది. కళావతి గారు నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతాడు. లేదండి. మీ తప్పేం లేదండి. మీరు జెంటిల్‌మెన్ అని నాకు తెలుసు అని కావ్య అంటుంది.

మరేమైంది ఎందుకు అలా వెళ్లిపోతున్నారు అని రాజ్ అడుగుతాడు. అలా ఏం లేదని చెబుతున్నాను. తర్వాత మళ్లీ కలుద్దాం బై అని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు యామిని వస్తుంటుంది. కావ్య ఏడుస్తూ కారులో కూర్చుని వెళ్లిపోతుంది. అప్పుడే యామిని కారు వస్తుంది. యామిని కారు దిగి రెస్టారెంట్‌లోకి వెళ్తుంది. కావ్యను చూడదు. ఇక్కడ ఏం చేస్తున్నావ్ బావా అని యామిని అడిగితే.. నీకోసమే చూస్తున్నాను అని రాజ్ అంటాడు.

నేను కాఫీ తాగాను నువ్ తాగేసి వచ్చేయ్ అని రాజ్ అంటే.. ఇది అన్యాయం, నీకోసం వస్తే...