భారతదేశం, ఏప్రిల్ 23 -- Brahmamudi: రాజ్ బ‌తికి ఉన్నాడా? లేదా? అన్న సీక్రెట్ కావ్య చేత బ‌య‌ట‌పెట్టించ‌డానికి కొత్త ప్లాన్ వేస్తుంది రుద్రాణి. రా మెటిరియ‌ల్ స‌ప్ల‌య్ చేసే కంపెనీకి కావ్య రెండు కోట్లు బాకీ ఉన్న సంగ‌తి ఆఫీస్‌లో ప‌నిచేసే వ్య‌క్తి రాహుల్ తెలుసుకుంటాడు. రాజ్ రాక‌పోతే కంపెనీ ఆ డీల్ పూర్తికాద‌ని, కంపెనీ మూత‌ప‌డుతుంద‌నే ప‌రిస్థితిని క్రియేట్ చేస్తారు.

త‌మ కంపెనీకి బాకీ ఉన్న న‌వ్య జ్యూవెల్ల‌రీ షాప్ ఓన‌ర్‌కు ఫోన్ చేస్తుంది రుద్రాణి. తాము నాలుగు కోట్లు బాకీ ఉన్నామ‌ని, ఆ డ‌బ్బుల వెంట‌నే చెల్లించ‌మ‌ని కావ్య తొంద‌ర‌పెడుతుంద‌ని జ్యువెల్ల‌రీ ఓన‌ర్ అంటాడు.

మీ డీల్ ఫినిష్ కావాలంటే బ‌తికున్న రాజ్ రావాలి....లేదంటే కావ్య పేరున ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ ఉండాలి అని ఓన‌ర్‌తో రుద్రాణి చెబుతుంది. కానీ కావ్య పేరిట ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ లేద‌నే నిజం జ్యువెల్ల‌...