భారతదేశం, ఏప్రిల్ 22 -- Brahmamudi రాజ్ బ‌తికే ఉన్న విష‌యం బ‌య‌ట‌పెట్టించ‌డానికి కుట్ర‌ప‌న్నుతుంది రుద్రాణి. ఆఫీస్‌లో రాజ్‌కు సంస్మ‌ర‌ణ స‌భ ఏర్పాటుచేయిస్తుంది. స్టాఫ్ అంతా రేపు మెయిన్ బ్రాంచ్‌కు వ‌చ్చి రాజ్‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నార‌ని రుద్రాణి అంటుంది.

అంద‌రిని ఒకే చోటికి ర‌ప్పించి ఈ కార్య‌క్ర‌మం నేనే ఏర్పాటుచేయిస్తున్నాన‌ని రుద్రాణి చెబుతుంది. చాల్లే ఆపు...బుద్దిలేని గాడిద అని రుద్రాణిపై ఇందిరాదేవి చిరాకు ప‌డుతుంది. అత్త‌య్య కాబ‌ట్టి మాట‌ల‌తో స‌రిపెట్టింది నేన‌యితేనా అని అప‌ర్ణ కోపంగా అంటుంది. కంపెనీ ఎంప్లాయిస్‌ను కావ్య పంపిచేస్తుంది.

రాజ్‌పై ఎంత గౌర‌వంగా శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించాల‌ని వ‌చ్చిన వాళ్ల‌ను ఎందుకు పంపించావ‌ని కావ్య‌పై ఫైర్ అవుతుంది రుద్రాణి. రాజ్ బ‌తికే ఉన్నాడ‌ని, తొంద‌ర‌లోనే ఇంటికివ‌స్తాడ‌ని నేను చెప్పానుగా...ఏంటి ఇదంతా ర...