భారతదేశం, ఏప్రిల్ 1 -- రాజ్‌తో ఛాటింగ్ చేస్తుంది కావ్య‌. ఒక‌సారి క‌ల‌వాల‌ని ఉంద‌ని రాజ్‌కు మెసేజ్ పెట్ట‌బోతుంది కావ్య‌. మ‌రోవైపు రాజ్ కూడా అదే ఆలోచిస్తుంటాడు. క‌ల‌వ‌మ‌ని అడిగితే త‌న‌ను కావ్య త‌ప్పుగా అర్థం చేసుకుంటుంద‌ని అనుకుంటాడు. ప‌రిచ‌యం లేని అమ్మాయిని క‌ల‌వ‌మ‌ని ఎలా అడ‌గాలా అని డైల‌మాలో ప‌డ‌తాడు. నేను నీ పెళ్లాన్ని అని, ఒక్క‌సారి క‌ల‌వ‌మ‌ని అడ‌గ‌ట‌మే ఆల‌స్యం ఎగురుకుంటూ వ‌చ్చి నీ క‌ళ్ల‌ముందు వాలిపోతా అని కావ్య అనుకుంటుంది.

చివ‌ర‌కు ధైర్యం చేసి రేపు ఒక‌సారి క‌లుద్దామా అని కావ్య‌కు మెసేజ్ పెడ‌తాడు రాజ్‌. ఆ మెసేజ్ చూడ‌గానే కావ్య ఆనందం ప‌ట్ట‌లేక‌పోతుంది. రాజ్‌ను ఆట‌ప‌ట్టించ‌డానికి ఎందుకు అని రిప్లై ఇస్తుంది. ఆ కార‌ణం ఏదో రేపు క‌లిసిన‌ప్పుడు చెబుతాన‌ని రాజ్ బ‌దులిస్తాడు. గ‌తం మ‌ర్చిపోయినా రాజ్ మొండిత‌నం మాత్రం త‌గ్గ‌లేద‌ని కావ్య లోలోన రుస...