Hyderabad, ఏప్రిల్ 19 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మిమ్మల్ని నేను అమ్మగా అనుకోవచ్చా. అలాగే, మీరు కూడా నన్ను మీ కొడుకు అనుకోండి. కాదనరనే నమ్మకంతో కేక్ తెప్పించాను. కట్ చేస్తారా అని అపర్ణను రాజ్ అడుగుతాడు. సొంత అమ్మనే అమ్మ అనుకోమంటున్నావా రాజ్ అని మనసులో అనుకుంటుంది అపర్ణ.

నా కొడుకు గుర్తొచ్చాడని చెబుతుంది అపర్ణ. ఆ కొడుకు కోసమే వచ్చి కేక్ కట్ చేయండి అని రాజ్ అపర్ణ చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. అపర్ణ ఎమోషనల్‌గా చూసుకుంటూ వెళ్తుంది. ఓ చోట అపర్ణకు కేక్‌కో బర్త్ డే సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తాడు రాజ్. మరోవైపు కారులో యామిని వస్తుంది. కేక్‌పైన హ్యాపీ బర్త్ డే అమ్మా అని రాసి ఉంటుంది. అది చూసి అపర్ణ మురిసిపోతుంది. రాజ్, కావ్య కలిసి అపర్ణ బర్త్ డే చేస్తారు.

ఇద్దరు అపర్ణకు విష్ చేస్తారు. మరోవైపు రామ్‌ను వెత...