Hyderabad, ఏప్రిల్ 18 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో గుడిలో రాజ్, కావ్యను చూసి దంపతులిద్దరు సీతారాముళ్ల చూడముచ్చటగా ఉన్నారు అని పంతులు అంటాడు. పూజారి గారు మేమిద్దిరం భార్యాభర్తలం కాదు. కానీ, ఈవిడ నాకు చాలా బాగా తెలిసినావిడ. చాలా మంచిది అని రాజ్ అంటాడు.

కావ్యకు పూజారి, రాజ్ ఇద్దరు క్షమాపణ చెబుతారు. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు అని పూజారి అడిగితే.. మా అమ్మ పేరు మీద. ఇవాళ ఆమె పుట్టినరోజు అని రాజ్ అంటాడు. అదంతా చూసిన అపర్ణ తెగ సంబరపడిపోతుంది. మీ అమ్మగారి పేరు అని పూజారి అడిగితే.. కాస్తా చెప్పలేకపోతాడు రాజ్. అపర్ణ అని చెప్పు బాబు అని అపర్ణ అంటూ ఉంటే.. భానుమతి అని రామ్‌గా మారిన రాజ్ అంటాడు. దాంతో అపర్ణ, కావ్య నిరాశపడతారు.

అలా తన తల్లి పేరును తనకు తెలియకుండానే రాజ్ మార్చేస్తాడు. గోత్రం అడిగితే.. రాజ...