Hyderabad, ఏప్రిల్ 17 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రుద్రాణికి ఇంటిల్లిపాది చివాట్లు పెట్టిన తర్వాత పైనుంచి అప్పు వస్తుంది. ఏం పొట్టి పోలీస్ ఎక్కడికి టింగు రంగా అని బయలుదేరావ్ అని రుద్రాణి అంటుంది. ఒక ఫ్యామిలీని ఇబ్బందిపెడుతున్న వాళ్లను పట్టుకునేందుకు అని అప్పు చెబితే.. అందులో మన జాతి రత్నాలు లేరా అని స్వప్న అంటుంది.

మనల్ని కాదులే అని రాహుల్ అంటే.. దొంగలే దొంగలు కాదని అనడం చాలా ఫన్నీగా ఉందని స్వప్న వెళ్లిపోతుంది. అక్కా చెప్పినట్లు అలాంటి లిస్ట్‌లో మీ పేర్లు లేకుండా ఉండాలని కోరుకోండి. ఉంటే మాత్రం మీరు అంటున్న ఈ పొట్టి పోలీస్ పవర్ ఏంటో చూడాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అప్పు. దులిపేసుకున్నట్లు రాహుల్ చేస్తే.. దులిపేసుకున్నావా అని రుద్రాణి అంటుంది.

ఈ ఇంట్లో మనకు జరిగే అవమానాలను...