భారతదేశం, ఏప్రిల్ 15 -- వెజిటేబుల్స్ తీసుకురావ‌డానికి మార్కెట్ వెళ్ల‌బోతున్న‌ట్లు రాజ్‌కు చెబుతుంది కావ్య‌. తాను కూర‌గాయ‌లు కొన‌డానికే మార్కెట్ వ‌స్తున్న‌ట్లు రాజ్ అబ‌ద్ధం ఆడుతాడు. నాకు కూర‌గాయ‌లు కొన‌డం తెలియ‌ద‌ని, సాయం చేయాల‌ని కావ్యను అడుగుతాడు రాజ్‌. మీరుంటేనే నేను ఈ రోజు దిగ్విజ‌యంగా వెజిటేబుల్స్ కొన‌గ‌ల‌ను అని చెబుతాడు.

కూర‌గాయ‌లు కొన్న త‌ర్వాత మీరు ఏది అడిగిన చేస్తాన‌ని కావ్య‌కు మాటిస్తాడు రాజ్‌. నాకు అదే కావాల‌ని మ‌న‌సులో కావ్య అనుకుంటుంది. కావ్య‌తో మాట్లాడే ఛాన్స్ రావ‌డంతో ఎగిరి గంతేస్తాడు. మ‌న ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం ఏమిటో ఈ సారి పూర్తిగా తెలుసుకొని తీరుతాన‌ని రాజ్ అంటాడు.

కూర‌గాయ‌ల బండి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన కావ్య‌...రాజ్ కోసం ఎదురుచూస్తుంది. ఏం కావాల‌ని కావ్య‌ను అడుగుతుంది కూర‌గాయ‌ల బండి ఓన‌ర్‌. మా ఆయ‌న కావాల‌ని కావ్య సెటైరిక‌ల...